దత్తన్న ఇంట్లో కత్తి కలకలం | Sword Knife Found In Bandaru Dattatreya House Police Alert | Sakshi
Sakshi News home page

దత్తన్న ఇంట్లో కత్తి కలకలం

Sep 5 2019 3:07 AM | Updated on Sep 5 2019 3:07 AM

Sword Knife Found In Bandaru Dattatreya House Police Alert - Sakshi

ముషీరాబాద్‌: హిమాచల్‌ప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ నివాసంలో ఒక కత్తి కలకలం రేపింది. గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయను అభినందించేందుకు నేతలు, కార్యకర్తలు అనేకమంది ఆయన ఇంటికి వస్తున్నారు. బుధవారం ఫిజియోథెరపీ ముగించుకుని దత్తాత్రేయ హాల్‌లోకి వచ్చిన వెంటనే ఆయనను కలిసేందుకు తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఓ వ్యక్తి జేబు నుంచి కత్తి (స్టేషనరీలో పేపర్‌ కట్టింగ్, వైర్ల కట్టింగ్‌ చేయడానికి ఉపయోగించేది) కిందపడింది. మాజీ డీజీపీ హెచ్‌జే దొర దత్తాత్రేయను కలవడానికి వచ్చిన సమయంలోనే ఇది చోటుచేసుకుంది. పోలీ సులు ఘటనస్థలానికి చేరుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement