కలబుర్గిలో బాలుడు ఆత్మహత్య | Student Commits Suicide In Karnataka | Sakshi
Sakshi News home page

కలబుర్గిలో బాలుడు ఆత్మహత్య

Oct 10 2018 1:08 PM | Updated on Nov 9 2018 4:36 PM

Student Commits Suicide In Karnataka - Sakshi

బ్లూవేల్‌ గేమ్‌ కారణమని వదంతులు

సాక్షి బెంగళూరు: కలబుర్గిలో సమర్థ్‌ (12) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. మహాలక్ష్మి లేఔట్‌లో ఉంటున్న సమర్థ్‌ ఒక ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కొద్దికాలంగా చదువును నిర్లక్ష్యం చేస్తూ మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. స్కూల్‌కు వెళ్లు.. బాగా చదువు అని తల్లిదండ్రులు మందలిస్తున్నారు. తల్లిదండ్రుల ఒత్తిడి, మందలింపుతో తట్టుకోలేక సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చాలించాడు. చుట్టుపక్కల వారు సమర్థ్‌ వీడియో గేములు ఎక్కువగా ఆడుతాడని, బ్లూవేల్‌ గేమ్‌కు బానిసై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు. ఏఎస్పీ లోకేశ్‌ స్పందిస్తూ బాలుని మరణానికి బ్లూవేల్‌ గేమ్‌ కారణం కాదన్నారు. తల్లిదండ్రులు మందలించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement