నెల్లూరు జిల్లాలో ఘోరం...

six killed in road accidents - Sakshi

రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

పండుగపూట విషాదం

ప్రైవేటు బస్సును దగ్ధం చేసిన స్థానికులు

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం వేర్వేరు చోట్ల మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలోల్ల ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.

టీపీ గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో తమిళనాడు రాష్ట్రంలోని వేళంగిని దేవాలయానికి వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ఎన్టీఆర్ నగర్ దగ్గర హైవేపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. అలాగే  శాంతినగర్‌ వద్ద ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కర్ణాటకకు చెందిన ప్రైవేటు బస్సు ఢీకొంది.

ఈ సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆగ్రహంతో బస్సుకు నిప్పుపెట్టారు. దాంతో బస్సు పూర్తిగా తగలబడింది. నెల్లూరు జిల్లా కావలి సమీపంలో సిరిపురం రోడ్డు వద్ద ఆదివారం ఉదయం కారు-బైక్‌ ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top