ఐటీ గ్రిడ్‌ కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన సిట్‌

SIT Probe Into IT Grid Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీ గ్రిడ్‌ డేటా చోరీ కేసుపై సిట్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ డేటా చోరీపై ఇప్పటికే ఆధార్‌ అథారిటీ రిపోర్ట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుపై ఆధార్‌ అధికారులు కూడా మాదాపూర్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రాష్ట్రాల కి చెందిన ఆధార్ డేటా చోరీ అయ్యిందని అందులో ఫిర్యాదు చేశారు. కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను సిట్‌ అధికారులు ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపించారు. 

ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఇచ్చే రిపోర్ట్‌ ఆధారంగా చర్యలు చేపట్టేందుకు సిట్‌ అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే దాదాపు 40 హార్డ్‌ డిస్క్‌లను ఎఫ్‌ఎస్‌ఎల్‌ విశ్లేషించింది. ఐటీ గ్రిడ్‌ ఎండీ అశోక్‌ కుమార్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు నోటిసులు ఇచ్చామన్నారు. అశోక్‌తో పాటు మరికొంత మందిని అరెస్ట్‌చేసేందుకు రంగం సిద్దం చేసింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top