
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని లక్డీకపూల్‌లోని సెంట్రల్ హోటల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హోటల్లోని అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకోవడంతో హోటల్‌లో ఉన్నవారందరినీ బయటకు పంపేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.