కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు దారుణం | School Cook Allegedly Throws Hot Dal On Class 1 Boy | Sakshi
Sakshi News home page

కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు దారుణం

Published Tue, Jan 30 2018 10:57 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

School Cook Allegedly Throws Hot Dal On Class 1 Boy - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మధ్యహ్నా భోజనంలో భాగంగా తనకు కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు ఓ వంటమనిషి ఒకటో తరగతి చదువుతున్న బాలుడి ముఖంపై వేడిగా కాలుతున్న పప్పును విసిరికొట్టాడు. దీంతో ఆ బాలుడి ముఖం కాలింది. అలాగే చెంపలు, ఛాతీ భాగం, వెనుక భాగం కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి.

పోలీసుల వివరాల ప్రకారం దిండోరిలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్స్‌ మెహ్రా అనే విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం స్కూల్లోనే చేసే క్రమంలో నేమావతి బాయి అనే వంట చేసే మహిళను తనకు కొంచెం అదనంగా పప్పు వేయాలని కోరాడు. దాంతో ఆమె నేరుగా పప్పు అతడిపై విసిరి కొట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement