ఘోర ప్రమాదాలు.. 12 మంది మృతి | Road Mishaps kills 12 in Maharashtra and Shimla | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదాలు.. 12 మంది మృతి

Oct 21 2017 9:16 AM | Updated on Oct 8 2018 7:02 PM

Road Mishaps kills 12 in Maharashtra and Shimla  - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో పది మంది దుర్మరణం పాలయ్యారు. 

టైల్స్‌ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు.. సంగ్లి వద్ద బోల్తా పడింది. దీంతో ట్రక్కుల్లో ప్రయాణిస్తున్న 10 మంది అక్కడిక్కడే మరణించారు. మరో పదకొండు మంది తీవ్రంగా గాయపడ్డారు.  ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారభించారు. టైల్స్ మీద పడటంతో వారంతా చనిపోయారని అధికారులు తెలిపారు. కాగా, మృతుల సంఖ్య 11కి చేరుకోగా.. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది.


బస్సు బోల్తా.. ఇద్దరి మృతి

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ లో ఈ ఉదయం ఓ బస్సు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రయాణికులతో సిమ్లా వెళ్తున్న బస్సు నాన్‌ఖరి ప్రాంతంలో లోయలో పడిపోయింది. 

ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతి చెందగా.. 10 మందికి గాయాలయినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement