రోడ్డుప్రమాదంలో రిటైర్డ్‌ ఎస్‌ఐ దుర్మరణం  | Retired SI Died In Road Accident At Keesara Ring Road | Sakshi
Sakshi News home page

Jun 6 2018 10:57 AM | Updated on Sep 4 2018 5:48 PM

Retired SI Died In Road Accident At Keesara Ring Road - Sakshi

కీసర : రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ ఎస్‌.ఐ  మృతిచెందిన సంఘటన మంగళవారం   కీసర రింగ్‌రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లాలాపేటకు చెందిన రిటైర్డ్‌ ఎస్‌.ఐ నర్సింహ్మారావు(62) మంగళవారం యాదాద్రిజిల్లా చికడిమామిడి గ్రామానికి వెళ్లి బైక్‌పై తిరిగివస్తుండగా  కీసర అవుటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కీసర సీఐ సురేందర్‌గౌడ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు  నర్సింహ్మారావు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌.ఐ పనిచేస్తూ ఇటివలై రిటైరైనట్లు  తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement