శ్రీనగర్‌లో ఆంక్షలు విధింపు | Restrictions imposed in Srinagar | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌లో ఆంక్షలు విధింపు

Apr 2 2018 9:36 AM | Updated on Apr 2 2018 9:36 AM

Restrictions imposed in Srinagar  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శ్రీనగర్‌: భద్రతాబలగాల చేతిలో నిన్న(ఆదివారం) 13 మంది ఉగ్రవాదులతో పాటు నలుగురు పౌరులు మృతిచెందటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా అధికారులు సోమవారం ఆంక్షలు విధించారు. షోపియాన్‌, అనంత్‌నాగ్‌ జిల్లాల్లో మూడు వేర్వేరు కాల్పుల ఘటనలు ఆదివారం చోటుచేసుకున్నసంగతి తెల్సిందే. ఈ ఘటనల్లో ఉగ్రవాదులతో పాటు ముగ్గురు సైనికులు కూడా చనిపోయారు. రాళ్లు విసిరిన సుమారు 60 మంది పౌరులు గాయపడ్డారు. వేర్పాటువాద నాయకులు సయేద్‌ అలీ గిలానీ, మీర్‌వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌, మహ్మద్‌ యాసిన్‌ మాలిక్‌లు సోమవారం నిరసన ర్యాలీకి పిలుపునవ్వడంతో వారిని గృహనిర్బంధం చేశారు.

భారీ ఎత్తున భద్రతా బలగాలు, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)లను నిషేధిత ప్రాంతాల్లోకి మోహరించారు. లోయలో మార్కెట్లు, రవాణా వ్యవస్థ, వ్యాపార సముదాయాలన్నీ మూతపడ్డాయి. పాఠశాలు,కళాశాలకు సెలవులు ఇచ్చారు. పరీక్షలను మరోతేదీకి వాయిదా వేశారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా పట్టణానికి, బన్నిహాల్‌ పట్టణాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలు నిలిపేసి, సామాజిక మాధ్యమాల్లోకి ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ కాకుండా ఉండేందుకు బ్రాడ్‌ బ్రాండ్‌ సర్వీసు స్పీడ్‌ తగ్గించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement