ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య | Rebel Madhya Pradesh Congress MLAs Daughter Hangs Self | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య

Mar 21 2020 10:36 AM | Updated on Mar 21 2020 10:36 AM

Rebel Madhya Pradesh Congress MLAs Daughter Hangs Self - Sakshi

జైపూర్‌ : మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యే సురేష్‌ ధక్కడ్‌ కుమార్తె జ్యోతి (24) ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజస్తాన్‌లోని తన మెట్టినింట్లో ఆమె ఆత్మహత్యకు చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె నివాసంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. జ్యోతి భర్త డా. జైసింగ్‌ రాజస్తాన్‌ వైద్య విభాగంలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. కాగా సురేష్‌ ధక్కడ్‌ మధ్యప్రదేశ్‌లోని పొహారీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన 22 మంది సభ్యుల్లో ఆయనా ఒకరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement