మైనర్‌ను గర్భవతిని చేసి తగులబెట్టిన ప్రియుడు

పాట్నా : ఇటీవల దేశంలో జరిగిన ఉన్నావ్, దిశ ఘటనలపై ప్రజల నుంచి భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతుండగా, మంగళవారం బీహార్‌లో ఉన్నావ్ తరహా ఘటన చోటుచేసుకుంది. బెట్టయ్య జిల్లాలోని ఓ గ్రామంలో ఒక యువకుడు మైనర్ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. బాలిక ఒకనెల గర్భంతో ఉండగా, యువకుడిని పెళ్లి చేసుకోమని కోరింది. ఈ నేపథ్యంలో పెళ్లికి నిరాకరించిన యువకుడు, తన స్నేహితులతో కలిసి ఒంటరిగా ఉన్న బాలిక ఇంట్లోకి వెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో స్పందించిన స్థానికులు బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు పాట్నాకు తీసుకెళ్లమని సూచించారు. పాట్నాకు వెళ్లేదారిలో బాధితురాలు 80 శాతం కాలిన గాయాలతో మంగళవారం మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు, అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి