
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం : బ్యాంకును పేల్చేస్తామంటూ మేనేజర్‌ను బెదిరింపులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెదిరింపులకు పాల్పడింది అనకాపల్లి మండలం వెలుగు కమ్యూనిటీలో క్లస్టర్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రాచేపల్లి వీర శివరంజనిగా గుర్తించారు. వివరాలు.. అనకాపల్లి విశాఖ గ్రామీణ బ్యాంకును పేల్చేస్తామంటూ.. ఆ బ్యాంకు మేనేజర్‌కు మెసేజ్ వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఈవీఎంలే టార్గెట్‌గా పేలుళ్లకు పాల్పడతామంటూ మెసేజ్‌లో పేర్కొనడంతో సదరు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి తిగిన పోలీసులు శివరంజనిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకు మేనేజర్‌తో సహా మరో 16మందిని కూడా ఇదే విధంగా బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టినట్లు గుర్తించారు.