స్నేహితులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ఆత్మహత్య | Peson Commited Suicide Because Of Friends In Mancherial | Sakshi
Sakshi News home page

స్నేహితులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ఆత్మహత్య

Oct 19 2019 9:13 AM | Updated on Oct 19 2019 9:15 AM

Peson Commited Suicide Because Of Friends In Mancherial - Sakshi

సాక్షి, మంచిర్యాల : స్నేహితుల వేధింపులు భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శ్రీరాంపూర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... శ్రీరాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కృష్ణకాలనీకి చెందిన మేకల తిరుపతి (30) దసరా సెలువు కావడంతో స్నేహితులు ఉదయ్, రమేష్‌లు కలసి రమేష్‌ కారులో టూర్‌కు వెళ్లారు. వెళ్తున్న సమయంలో కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ కారు చెడిపోయింది.

కారును తిరుపతి డ్రైవింగ్‌ చేస్తుండగా ప్రమాదం జరిగిందని ఉదయ్, రమేష్‌లు కారు రిపేర్‌ చేయించేందుకు డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో తిరుపతి ఒప్పుకున్నాడు. ఇటీవల రిపేరు ఖర్చులు ఇవ్వడం వద్దని, కొత్త కారు కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. తరుచుగా ఫోన్లో  చంపేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. ఈ నెల 17న తిరుపతి నివాసం ఉంటున్న ఇంటికి వచ్చి కారు కొనియ్యకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తిరుపతి ఇంట్లో ఎవరు లేని సమయంలో సూపర్‌ వాస్‌మల్‌ 33 సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి మృతికి కారకులైన రమేష్, ఉదయ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాని కోరారు. తిరుపతి భార్య వనజ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై అంజన్న తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement