పోలీసులపై గిరిజనుల దాడి | People Attacked On Police In Yadadri Bhuvanagiri District | Sakshi
Sakshi News home page

పోలీసులపై గిరిజనుల దాడి

Mar 10 2019 6:55 PM | Updated on Mar 10 2019 8:23 PM

People Attacked On Police In Yadadri Bhuvanagiri District - Sakshi

తగలబెట్టడంతో కాలిపోయిన పీడీఎస్‌ బియ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా: రాజుపేట్‌ మండలం పుట్టగూడెం తండాలో ఎస్‌ఓటీ పోలీసులపై స్థానిక గిరిజనులు దాడి చేశారు. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తోన్నట్లు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల రాక గమనించిన గిరిజనులు కర్రలతో తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో కానిస్టేబుళ్లు సుబ్బరాజు, సంజీవ రెడ్డి, ఎస్‌ఐ సురేందర్‌ రెడ్డిలకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇందులో సుబ్బరాజు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. పోలీసులపై దాడి చేసే సమయంలో ఆధారాలు లేకుండా చేసేందుకు పీడీఎస్‌ బియ్యపు బస్తాలపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement