పదిన్నర క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత | PDS rice Captured | Sakshi
Sakshi News home page

పదిన్నర క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

May 2 2018 9:53 AM | Updated on Oct 17 2018 6:10 PM

PDS rice Captured - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నందిపేట్‌(ఆర్మూర్‌) : మండల కేంద్రంలోని బర్కతుపుర కాలనీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యాన్ని సోమవారం రాత్రి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. విశ్వనీయ సమాచారం మేరకు దాడులు చేశారు. రేషన్‌ దుకాణం నం.10 నుంచి ఎం.సాయన్న 18 సంచుల బియ్యాన్ని(8 క్వింటాళ్లు) అక్రమంగా తరలించే ప్రయత్నం చేశారు. మండల కేంద్రంలోని రేషన్‌ దుకాణం నం.26 నుంచి 2.5 క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో వేసి తరలిస్తుండగా వలవేసి పట్టుకుని బియ్యాన్ని సీజ్‌ చేశారు. అనంతరం డీలర్లపై 6ఏ కింద కేసులు నమోదు చేశారు. దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, స్థానిక రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement