చెత్త బండిలో లక్షాధికారి శవ యాత్ర  | Millionaire Dead Body in the Garbage Cart | Sakshi
Sakshi News home page

చెత్త బండిలో లక్షాధికారి శవ యాత్ర 

Apr 6 2018 1:39 AM | Updated on Apr 6 2018 1:39 AM

Millionaire Dead Body in the Garbage Cart - Sakshi

చెత్త బండిలో మృతదేహాం తీసుకెళ్తున్న దృశ్యం

వేలూరు(తమిళనాడు): లక్షాధికారిగా జీవించిన ఓ వ్యక్తిని మరణించాక బంధువులు, కన్న బిడ్డలు అనాథగా వదిలిపెట్టడంతో అతని మృతదేహాన్ని చెత్త బండిలో తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో చోటుచేసుకుంది. షోలింగర్‌కు చెందిన రాజారామ్‌(70) భార్య కొన్నేళ్ల క్రితం మరణించడంతో కన్నబిడ్డలు అతన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో వీధుల్లో బిక్షాటన చేసి జీవిస్తుండేవాడు.

గత నెల 27న రాజారామ్‌ మృతిచెందాడు. ఆయన బంధువులకు పోలీసులు సమాచారం అందజేశారు. రాజారామ్‌తో తమకు సంబంధం లేదని కన్నబిడ్డలు మృతదేహాన్ని తీసుకోలేదు. దీంతో బుధవారం పోస్టుమార్టం నిర్వహించి పారిశుధ్య కార్మికుల సాయంతో చెత్త తీసుకెళ్లే బండిలో మృతదేహాన్ని తీసుకెళ్లి దహనక్రియలు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement