
సాక్షి, హైదరాబాద్ : సనత్‌నగర్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పదంగా మృతి చెందారు. 20 రోజుల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న పూర్ణిమా.. బుధవారం ఉదయం శవమై కనిపించింది. సనత్‌నగర్‌కు చెందిన పూర్ణిమ తండ్రి ఓ పారిశ్రామికవేత్త. ఆయన పరిశ్రమలో పనిచేస్తున్న దాసరి కార్తీక్ అనే యువకుడిని పూర్ణిమ ప్రేమించింది. అయితే వీరి ప్రేమను పూర్ణిమ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులను ఎదిరించి 20 రోజుల క్రితమే కార్తిక్‌తో బయటకు వచ్చి వివాహం చేసుకుంది. కాగా, తమ కూతురును కార్తికే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పూర్ణిమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కార్తిక్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ సనత్‌నగర్ పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు.