నిజంగా ఆశ కిటికీకి ఉరి వేసుకుందా? | Married Woman Suspicious death In Karnataka | Sakshi
Sakshi News home page

వివాహిత అనుమానాస్పద మృతి

Jun 14 2018 9:15 AM | Updated on Jun 14 2018 11:05 AM

Married Woman Suspicious death In Karnataka - Sakshi

ఆశా(ఫైల్‌)

కృష్ణరాజపురం:  కుటుంబ కలహాలు, వేధింపుల నేపథ్యంలో ఓ వివాహిత కిటికీకి ఉరి వేసుకున్న స్థితిలో అనుమానస్పదంగా మృతి చెందిన  ఘటణ బెంగళూరు నగరంలోని ఆవలహళ్ళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఆవలహళ్లికి చెందిన వేణుగోపాల్‌కు కోలారుకు చెందిన ఆశా(22)తో ఏడాది క్రితం వివాహమైంది. కొన్ని నెలల పాటు వీరి దాంపత్యం సవ్యంగా సాగింది. అయితే వేణుగోపాల్, అతని తల్లి కొంతకాలంగా తనను వేధిస్తున్నట్లు ఆశ తన పుట్టినింటివారితో చెప్పుకొని బాధపడేది.

మంగళవారం సాయంత్రం దంపతుల మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈక్రమంలో ఆశ కిటికీకి ఉరి వేసుకుందని చెబుతూ ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆశ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.  ఆశ తల్లిదండ్రులు తమ కుమార్తె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేసి వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement