భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని..  | Man Stabs Neighbour For Having Affair With his Wife In Pakistan | Sakshi
Sakshi News home page

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. 

Sep 22 2019 8:57 PM | Updated on Sep 22 2019 9:01 PM

Man Stabs Neighbour For Having Affair With his Wife In Pakistan - Sakshi

నెల రోజుల క్రితం ఫైసల్‌లో గొడవపడి భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే..

కరాచీ : భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పొరుగింటి వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడో వ్యక్తి. ఈ దారుణ ఘటన పాకిస్తాన్‌లోని సూర్జని నగరంలో చోటు చేసుకుంది. నిందితుడు ఫైసల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరాచీలోని సూర్జని ప్రాంతానికి చెందిన ఫైసల్‌ భార్యతో కలిసి ఉంటున్నాడు. నెల రోజుల క్రితం ఫైసల్‌లో గొడవపడి భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ తన సోదరితో కలిసి ఉండేది. అక్కడే ఉన్న షాహీన్‌ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆమెకు కొత్త సిమ్‌ ఇచ్చి తరచూ మాట్లాడుకునేవారు.

ఈ విషయం తెలుసున్న ఫైసల్‌ భార్యను నిలదీశాడు. అలాగే షాహీన్‌ ఇంటికి వెళ్లి అతని తండ్రికి విషయం చెప్పి కొడుకును అదుపులో పెట్టుకోమని హెచ్చరించాడు. అయినప్పటికి షాహీన్‌ తన అక్రమ సంబంధాన్ని అలాగే కొనసాగించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఫైసల్‌ షాహీన్‌ను హత్య చేయాలని ప్లాన్‌ చేశాడు. ఈ నెల 14న షాహీన్‌ ఇంటికి వెళ్లి మత్తుమందు ఇచ్చి కత్తితో దారుణంగా పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అధిక రక్తస్రావం జరిగి ఫైసల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. షాహీన్‌ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫైసల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement