కూతుర్ని చంపేసిన సవతి తండ్రి..

లక్నో: ‘నాన్న బెలూన్ కొనివ్వు’ అన్నందుకు కూతురినే చంపేశాడో దుర్మార్గపు తండ్రి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు... ఖుల్దాబాద్‌లోని సిద్ధార్థనగర్‌లో అద్దెకు నివసిస్తున్న ఓ జంట మందులకోసమని కూతురును వెంటబెట్టుకుని బయటకు వెళ్లింది. ఈ సమయంలో బెలూన్ కావాలంటూ నాలుగేళ్ల కూతురు సవతి తండ్రిని కోరింది. అతను కోపంతో ఆమెను ఇష్టమొచ్చినట్టుగా కొట్టాడు. అడ్డొచ్చిన భార్యను సైతం కిందపడేశాడు. అనంతరం ఆవేశంతో కూతురుని తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరుకుని తన గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. ఉదయం అతని గదిలోకి వెళ్లి చూసిన భార్య హతాశురాలైంది. ఆమె భర్త కూతురును చంపి, శవం పక్కనే గాయాలతో పడి ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారమివ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ చేపట్టారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి