ప్రాణం తీసిన భోజనం గొడవ   | Man Killed His Friend At Party | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన భోజనం గొడవ  

Aug 14 2018 8:19 AM | Updated on Aug 29 2018 8:36 PM

Man Killed His Friend At Party  - Sakshi

దాడికి పాల్పడిన ప్రభాకర్‌రెడ్డి 

ములుగు(గజ్వేల్‌) : మద్యం మత్తు ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చురేపింది. ఆపై విచక్షణ కోల్పోయిన మిత్రుడు గొడ్డలితో దాడి చేసి స్నేహితుడిని దారుణంగా హతమార్చాడు. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం భవానందపూర్‌ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం రాత్రి 12 గంటలకు ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి గజ్వేల్‌ రూరల్‌ సీఐ శివలింగం తెలిపిన వివరాలు.. భవానందపూర్‌ సమీపంలో పక్కపక్కనే ఉన్న రెండు వ్యవసాయ క్షేత్రాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌(27), కర్నూలు జిల్లాకు చెందిన ప్రభాకర్‌రెడ్డి పని చేస్తున్నారు.

వీరిద్దరూ కలిసి ఆదివారం రాత్రి పార్టీ చేసుకుందామని నిర్ణయించుకొని.. మద్యం, చికెన్‌ తెచ్చుకున్నారు. శ్రీనివాస్‌ గదిలో వంట చేసుకుని.. భవానందపూర్‌కు చెందిన చంద్రమౌళి, గుంటూరుకు చెందిన మేస్త్రీ సురేశ్‌ని పార్టీకి ఆహ్వానించారు. నలుగురు కలసి తాగిన తర్వాత భోజనం విషయంలో శ్రీనివాస్, ప్రభాకర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.

ఇద్దరూ ఘర్షణ పడటంతో చంద్రమౌళి, సురేష్, అప్పుడే అక్కడికి వచ్చే మరో వ్యక్తి స్వామి వారిని సముదాయించారు. ఈక్రమంలో కోపోద్రిక్తుడైన ప్రభాకర్‌రెడ్డి తాను పనిచేసి వ్యవసాయక్షేత్రం నుంచి గొడ్డలి తీసుకొచ్చి శ్రీనివాసుపై దాడి చేశాడు. తలపై తీవ్ర గాయం కావడంతో శ్రీనివాస్‌ కూర్చున్న చోటేకూలబడిపోయాడు. ఇదిలా ఉండగా, అక్కడున్న మిగతావారు నిందుతుడిని పోలీసులకు అప్పగించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement