కారుకి బైక్‌ నంబరు తగిలించి మోసం | Man Cheated Finance Company in Karnataka | Sakshi
Sakshi News home page

అప్పు తీసుకుని కారు కొనుగోలు

Jan 21 2019 12:10 PM | Updated on Jan 21 2019 12:55 PM

Man Cheated Finance Company in Karnataka - Sakshi

మానవ హక్కుల ఫోరం బోర్డుతో తిరుగుతూ దర్జా

కర్ణాటక, దొడ్డబళ్లాపురం : ఫైనాన్స్‌ కింద డబ్బు తీసుకుని కారు ఖరీదుచేసి అప్పు తీర్చలేక కారు నంబరు మార్చి తిరుగుతున్న యువకుడిని దొడ్డ తాలూకా హొసహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు మారత్‌హళ్లి నివాసి పునీత్‌ (28) ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ నుండి రూ.4 లక్షలు అప్పు తీసుకున్న కారు కొన్నాడు. తిరిగి అప్పు చెల్లించలేక మాస్టర్‌ ప్లాన్‌ వేసాడు. కారు నంబరుకు ఒక బైక్‌ నంబరు రాయించాడు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు అడ్డుకోరాదని మానవహక్కుల సంఘం–పబ్లిక్‌ ఫోరం–బెంగళూరు యూత్‌ అని చాంతాండంత పేర్లు రాయించి కారుకు తగిలించుకుని తిరుగుతున్నాడు. ఫైనాన్స్‌ కంపెనీ వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement