భార్య కాపురానికి రాలేదని.. ఆత్మహత్యాయత్నం | Man Attempted Suicide In Nagarkurnool | Sakshi
Sakshi News home page

గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Sep 14 2019 7:15 PM | Updated on Sep 14 2019 8:42 PM

Man Attempted Suicide In Nagarkurnool - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నాగర్‌ కర్నూలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట చోటుచేసుకుంది. బిజినపల్లి మండలానికి చెందిన నిజామ్‌..తన భార్య కాపురానికి రావడం లేదని నాగర్‌కర్నూలు పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. అయితే బిజినపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. పోలీసులు చెప్పినా వినకుండా.. మద్యం మత్తులో ఉన్నఆ వ్యక్తి గొంతు కోసుకున్నాడు. బాధితుడిని పోలీసులు నాగర్‌కర్నూలు జిల్లా ఆసుప్రతికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement