కీచక తండ్రిపై నిర్భయ కేసు | knirbhaya case in her father | Sakshi
Sakshi News home page

కీచక తండ్రిపై నిర్భయ కేసు

Apr 30 2018 5:03 AM | Updated on Oct 17 2018 5:51 PM

knirbhaya case in her father - Sakshi

సత్తుపల్లి: కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురిపై లైంగికదాడికి పాల్పడి కటకటాల పాలయ్యాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ సీఐ మేడిశెట్టి వెంకటనర్సయ్య కథనం ప్రకారం.. మండల çపరిధిలోని సదాశివునిపాలెం గ్రామానికి చెందిన ఓ కామాంధుడు మద్యం మత్తులో మైనర్‌ కూతురిపై లైంగికదాడికి పాల్పడడంతో తల్లి ప్రతిఘటించి పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. శనివారం తహసీల్దార్‌ దొడ్డా పుల్లయ్య, ఆర్‌ఐ విజయభాస్కర్, వీఆర్వో రామిశెట్టి శేఖర్‌ ద్వారా విచారణ చేయించారు. పోలీసులు కూడా గ్రామంలో విచారణ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement