ఫొటో తీసిన పోలీసును కుర్చీకి కట్టేసి.. | Kashmir Cop Tied To Chair, Roughed Up Allegedly For Taking Photo Of Woman | Sakshi
Sakshi News home page

ఫొటో తీసిన పోలీసును కుర్చీకి కట్టేసి..

Oct 14 2017 8:01 PM | Updated on Aug 21 2018 5:54 PM

Kashmir Cop Tied To Chair, Roughed Up Allegedly For Taking Photo Of Woman - Sakshi

పోలీసును కుర్చీకి కట్టేస్తున్న బాధితురాలు, స్థానికులు

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో ఓ పోలీసుకు కొంతమంది వ్యక్తులు చుక్కలు చూపించారు. ఓ మహిళ ఫొటో తీశాడని ఆగ్రహంతో అతడిని ఓ కుర్చికీ కట్టేసి చిత్రవద చేశారు. శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గండేర్బల్‌ జిల్లాలో ఓ పోలీసు అధికారి ఓ ముస్లిం మహిళను ఫొటో తీశాడు.

దీంతో గట్టిగా అరిచింది. పోలీసు చేసిన చర్యను అక్కడి వారంతా ఖండిస్తూ పోలీసుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అతడిని నడి వీదిలో ఓ కుర్చీకి కట్టేసి కొట్టారు. ఆ మహిళ ఆగ్రహంతో అతడిని తిడుతూ చేయి కూడా చేసుకుంది. అనంతరం పోలీసులు వచ్చి ఆ పోలీసును అదుపులోకి తీసుకున్నారు. విచారణకు ఆదేశిస్తూ అతడిని విధుల్లో నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

పోలీసును చితకబాదిన మహిళలు వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement