చింతమనేనిపై జర్నలిస్టుల ఫిర్యాదు

Journalists complaints Againist TDP MLA Chintamaneni Prabhakar In Eluru - Sakshi

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు విజిలెన్స్‌ కార్యాలయం వద్ద విధి నిర్వహణలో ఉన్న వీడియో జర్నలిస్టులను అకారణంగా అసభ్య పదజాలంతో దూషించి దౌర్జన్యానికి పాల్పడిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం అదనపు ఎస్పీ ఈశ్వరరావుని కలిసి వినతిపత్రం సమర్పించారు. రెండు రోజుల క్రితం అక్రమంగా ఇసుక తవ్వుతున్నారన్న కారణంగా చింతమనేని అనుచరుల వాహనాలను విజిలెన్స్‌ అధికారులు సంఘటనాస్థలంలోనే సీజ్‌ చేశారు. ఈ విషయం తెలిసి చింతమనేని, ఆయన అనుచరులు సుమారు 100 మంది సంఘటనాస్థలానికి చేరుకుని బలవంతంగా సీజ్‌ చేసిన వాహనాలను తీసుకుపోవడం, ఈ విషయమై విజిలెన్స్‌ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top