‘నా భార్యను దౌర్జన్యంగా తీసుకెళ్లారు’ | Husband Complaint on Wife Kidnap Case in YSR Kadapa | Sakshi
Sakshi News home page

‘నా భార్యను దౌర్జన్యంగా తీసుకెళ్లారు’

May 21 2019 7:40 AM | Updated on May 21 2019 7:40 AM

Husband Complaint on Wife Kidnap Case in YSR Kadapa - Sakshi

పెళ్ళైన మరుసటిరోజే బలవంతంగా తీసుకెళ్లారన్నారు.

కడప రూరల్‌:  ప్రేమ వివాహం చేసుకున్నాం. నా భార్యను దౌర్జన్యంగా తీసుకెళ్లారు.. న్యాయం చేయాలని రాజంపేట పట్టణానికి చెందిన మహేష్‌ కోరారు. సోమవారం స్థానిక వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా, వీ కోట మండలం కందుకూరుకు చెందిన పవిత్రతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందన్నారు. ఆమె కుంటుంబంతో మాకు దగ్గరి బంధుత్వం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తాము ఈనెల 11వ తేదీన రాజంపేటలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో వివాహం చేసుకున్నామన్నారు. అదే రోజు సాయంత్రం పవిత్ర బంధువులు వచ్చి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారన్నారు. ఇప్పుడు వారు తనకు  ఫోన్‌ చేసి ఒంగోలుకు వచ్చి నీ భార్యను తీసుకెళ్లాలని చెబుతున్నారని పేర్కొన్నారు. దీని వెనుక కుట్ర ఉన్నట్లుగా ఆనుమానం ఉందన్నారు. కాగా వారే ఇక్కడికి వచ్చేలా చూడాలని కోరారు. ఈ విషయమై జిల్లా ఎస్పీతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement