భార్య టీ పెట్టి ఇవ్వ లేదని.. | Husband Commits Suicide While Wife didnt Give Tea | Sakshi
Sakshi News home page

భార్య టీ పెట్టి ఇవ్వ లేదని..

Nov 18 2019 7:39 AM | Updated on Nov 18 2019 7:39 AM

Husband Commits Suicide While Wife didnt Give Tea - Sakshi

జగద్గిరిగుట్ట: భార్య టీ పెట్టి ఇవ్వలేదని గొడవ పడిన భర్త క్వారీ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాలయ్యనగర్‌కు చెందిన అడివయ్య (35) ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆదివారం ఉదయం టీ పెట్టివ్వాలని భార్య జ్యోతిని కోరగా ఇప్పుడు కాదు తర్వాత ఇస్తానని ఆమె సమాధానం ఇచ్చింది. దీంతో భార్యతో గొడవ పడిన అడివయ్య పక్కనే ఉన్న క్వారీ గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement