ప్రాణాలు పోయినా పర్వాలేదు | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 13 2018 1:07 PM

Horrible Chain Snatching Robberies in Chennai - Sakshi

సాక్షి, చెన్నై : చెయిన్‌ స్నాచర్లు రాను రాను రెచ్చిపోతున్నారు. ప్రాణాలు పోయిన ఫర్వాలేదనుకుని ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే చెన్నై నగర పరిధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోగా.. ఆ వీడియోలు వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుండటం స్థానికుల్లో భయాందోళలకు గురిచేస్తోంది.

అరుమ్‌బాక్కమ్‌ జరిగిన షాకింగ్‌ ఘటనలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు మహిళ(52) మెడలోని గొలుసు లాక్కునేందుకు యత్నించారు. అయితే అది ఎంతకు రాకపోవటంతో ఆమె కిందపడిపోయింది ఈ క్రమంలో ఆమెను 50 మీటర్లపాటు అలాగే ముందుకు లాక్కునిపోయారు. బాధితురాలిని ఓల్డ్‌ వాషర్‌మెన్‌పేట్‌కు చెందిన మేనకగా గుర్తించారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగానే గాయపడినట్లు సమాచారం.

మరో ఘటనలో కున్రతూర్‌కు చెందిన 57 ఏళ్ల జయశ్రీ తన భర్తతో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ దొంగ ఆమెపై పడి ఏడు తులాల బంగారు గోలుసును లాక్కునిపోయాడు. బైక్‌పై వచ్చిన ఇద్దరు ముందుగా వారిపై ఓ కన్నేశారు. తర్వాత వారిలో ఒకడు ఆమె వద్దకు వెళ్లి గొలుసు లాగాడు. ఈ క్రమంలో ఆమె కిందపడి గాయపడగా.. దొంగను పట్టుకునేందుకు భర్త చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. మహిళలు, ముఖ్యంగా వృద్ధులు బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement