గొర్రెల దొంగతనానికి వచ్చి.. గ్రామస్తులకు చిక్కి

Goat Thiefs Arrest in Medak - Sakshi

సీసీ కెమెరాలకు చిక్కకుండా వైర్లు తొలగించిన వైనం

నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

పరారీలో ఉన్నారని చెబుతున్న పోలీసులు

అక్కన్నపేట(హుస్నాబాద్‌): అర్థరాత్రి దొంగతనానికి వచ్చిన ముగ్గురు యువకులను చితకబాది పోలీసులకు అప్పగించిన సంఘటన అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం.. విద్యుత్‌ స్తంభాలపై ఉన్న సీసీ కెమెరాల వైర్లను తొలగించి గొర్రెలను ఎత్తుకెళ్లే ప్రయత్నంలో గ్రామస్తులు పట్టుకొని ఓ ఇంటి ఎదుట గేటుకు కట్టేశారు. ఆ ముగ్గురు గిరిజన యువకులు హుస్నాబాద్‌ మండలంలోని భల్లునాయక్‌ తండాకు చెందినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. రెండు రోజుల కింద గండిపల్లిలో కూడా గొర్రెలను ఎత్తుకుపోయారని జల్సాల కోసం ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పలువురు పేర్కొన్నారు. ఈ విషయంపై సాక్షి ఎస్‌ఐ పాపయ్యనాయక్‌ను సంప్రదించగా ఆ ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని తెలపడం కొసమెరుపు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top