సిద్దిపేటలో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident In Siddipet | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో భారీ అగ్ని ప్రమాదం

Feb 9 2019 3:47 PM | Updated on Feb 9 2019 5:39 PM

Fire Accident In Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట రైతు బజార్‌ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జనం భయాందోళనలకు గురై పరుగులు తీశారు. స్థానికుల సమాచారం ప్రకారం మొదటగా రైతు బజారు ఎదురుగా ఉన్న దుకాణంలో మంటలు సంభవించాయని, అనంతరం మరికొన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయని తెలిపారు. ఎగసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. 

గాలి విపరీతంగా ఉండటంతో మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉందని చుట్టుపక్కల ఇళ్లల్లోని ప్రజలను ముందస్తు జాగ్రత్తగా ఖాళీ చేపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీసీపీ నర్సింహారెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఫైర్‌ ఇంజన్లను అధికారులు తెప్పిస్తున్నారు. ఇప్పటివరకు 8 షాపులు పూర్తిగా దగ్దమయ్యాయని, భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement