8నెలల చిన్నారిని భవనంపై నుంచి పడేసిన తండ్రి.. | Father Throws His Child Off Second Floor In Hyderabad | Sakshi
Sakshi News home page

8నెలల చిన్నారిని భవనంపై నుంచి పడేసిన తండ్రి..

Dec 31 2018 12:28 PM | Updated on Dec 31 2018 12:33 PM

Father Throws His Child Off Second Floor In Hyderabad - Sakshi

ఆదివారం సాయంత్రం ఓ విషయమై భార్యభర్తల గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన మనోజ్‌ చిన్నారిని..

సాక్షి, హైదరాబాద్‌ : భార్యతో గొడవ పడ్డ ఓ భర్త 8 నెలల కూతుర్ని రెండవ అంతస్తుపై నుంచి పడేశాడు. ఈ ఘటన నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్లాపూర్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన మనోజ్‌, జాహ్నవి అనే దంపతులు మల్లాపూర్‌ నర్సింహానగర్‌లో నివాసముంటున్నారు. వీరికి 8నెలల పాప ఉంది. మనోజ్‌ వృత్తి రీత్యా డీసీఎమ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఓ విషయమై భార్యభర్తల గొడవ జరిగింది.

దీంతో ఆగ్రహించిన మనోజ్‌ చిన్నారిని రెండవ అంతస్తు మీదనుంచి కిందకు పడేశాడు. పాప కింద పడటం గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించటంతో ప్రమాదం తప్పింది. పాపకు ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.  ప్రస్తుతం  చిన్నారి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement