ముగ్గురు చిన్నారులను బలిగొన్న కసాయి తండ్రి

Father Killed His Three Children In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పిల్లలను గుండెలపై ఆడించాల్సిన తండ్రి ఊపిరి తీసేశాడు. భార్యభర్తల మధ్య గొడవలకు అభంశుభం తెలియని చిన్నారులను బలితీసుకున్నాడు. ముక్కు పచ్చలారని ముగ్గురు మగపిల్లలను కర్కశంగా నీటిలో ముంచి చంపాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బలగంగానపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చిత్తూరు రూరల్‌ మండలంలోని దిగువపల్లికి చెందిన అమరావతి అనే మహిళతో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది.

వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా డ్రైవర్‌ కావటంతో లారీకి వెళ్లేవాడు. అయితే ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ముగ్గురు మగపిల్లలను తన సొంత గ్రామానికి తీసుకువెళ్తానంటూ అతడు వారిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో గంగాధర నెల్లూరు వద్దగల నీవా నదిలో వారిని పడేసి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top