బాలికపై అత్యాచారయత్నం చిన్నాన్న అరెస్ట్‌

Father Arrest in Girl Child Molestation Case Chittoor - Sakshi

చిత్తూరు, చౌడేపల్లె : తొమ్మిదేళ్ల బాలికపై వరుసకు చిన్నాన్న అత్యాచార యత్నానికి పాల్పడిన కేసులో జి.మునిరాజ (28) అరెస్ట్‌ చేసినట్లు సీఐ మధుసూదనరెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఎస్‌ఐ అనిల్‌కుమార్‌తో కలిసి విలేకరులకు సీఐ తెలిపిన వివరాలు..ఈనెల 1న కోటూరు సమీపంలోని చింతతోపులో మునిరా జ తన అన్న కుమార్తె అయిన తొమ్మిదేళ్ల బాలికను ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో పరిసర ప్రాంతంలోని పశువుల కాపరులు గుర్తించి అతడిని చితకబాదారు. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో నిందితునిపై ఫోక్సో యాక్ట్‌ కింద ఐపీసీ 376, 511/,5,7 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్‌ చేసి పుంగనూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించారు.

అత్యాచారయత్న నిందితుడికి రిమాండ్‌
వాల్మీకిపురం : బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటనలో  నిందితుడు లారీ డ్రైవర్‌ గంగాధర్‌ (38)పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ మోహన్‌కుమార్‌ బుధవారం విలేకరులకు తెలిపారు. అతడిని స్థానిక జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో మదనపల్లె సబ్‌జైలుకు తరలించినట్లు చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top