ఇంజినీరింగ్‌ విద్యార్థిని అదృశ్యం | Engineering Student Missing In Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ విద్యార్థిని అదృశ్యం

Apr 19 2019 7:35 AM | Updated on Apr 19 2019 7:35 AM

Engineering Student Missing In Hyderabad - Sakshi

సాయి మేఘన (ఫైల్‌)

దూద్‌బౌలి: ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని అదృశ్యమైన సంఘటన హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై రాము నాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పురానాపూల్‌ మూసా ఖాద్రీ దర్గా ప్రాంతానికి చెందిన లింగం గౌడ్‌ కుమార్తె సాయి మేఘన (19) నగరంలోని కళాశాలలో ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 16న లింగంగౌడ్‌ కుమార్తెను బైక్‌పై అఫ్జల్‌గంజ్‌ బస్టాండ్‌ వదిలి వచ్చాడు. అయితే సాయంత్రం ఆమె తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.దీంతో తన కూతురు కనిపించడం లేదని హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement