ఎయిర్‌పోర్ట్ స్కాం : జీవీకే గ్రూపు బుక్

ED files charges against GVK group promoters for Mumbai airport scam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముంబై ఎయిర్‌పోర్ట్ స్కాంకు సంబంధించి మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. 705 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలతో జీవీకే గ్రూప్, ప్రమోటర్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (మియాల్) అధికారులు, మరికొన్ని సంస్థలపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్  చట్టం కింద కేసు ఫైల్ చేసింది.  (జీవీకే గ్రూపునకు సీబీఐ షాక్!)

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) సెక్షన్ 3 కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను  దాఖలు చేసిందని ఈడీ  అధికారులు ధృవీకరించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా రాబోయే వారాల్లో ప్రశ్నించనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.  ఈ క్రమంలో  కంపెనీల ఖాతాల పరిశీలన, నిధుల బదిలీని త్వరలోనే ఈడీ ప్రారంభించనుందని అంచనా. అలాగే దర్యాప్తులో భాగంగా ఆస్తులను అటాచ్ చేసే  అవకాశం ఉంది. మరోవైపు ఈడీ నుంచి తమకు ఎలాంటి నోటీసు రాలేదని  జీవీకే ప్రతినిధి వ్యాఖ్యానించారు.  (ముంబై ఎయిర్‌పోర్టు పనుల్లో జీవీకే స్కాం!)

కాగా గత నెలలో జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు, మియాల్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ సంజయ్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు  చేసిన సంగతి తెలిసిందే. (భారీ కుంభకోణం : బ్యాంకు మాజీ సీఈఓ ఆత్మహత్య?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top