
మామపై దాడి చేస్తున్న కోడలు అలిస్మాభాను
అదే ప్రాంతానికి చెందిన సమీర్‌తో అలిస్మా సన్నిహితంగా మెలుగుతూ ఆస్తి మొత్తం తమ పేరుపై మార్చాలంటూ మామ గులాబ్‌జాన్‌తో పాటు దివ్యాంగుడైన భర్తపై ప్రియుడు సమీర్‌తో కలసి దాడి చేస్తోంది.
కృష్ణరాజపురం : ఆస్తి కోసం మామతో పాటు మానసిక దివ్యాంగుడైన భర్తపై ఓ మహిళ తన ప్రియుడితో కలసి దాడికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం కేజీ హళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.కేజీ హళ్లి ప్రాంతానికి చెందిన గులాబ్‌జాన్ అనే వ్యక్తి కుమారుడికి కొద్ది సంవత్సరాల క్రితం అలిస్మా భాను అనే మహిళతో వివాహమైంది. అయితే అదే ప్రాంతానికి చెందిన సమీర్ అనే రౌడీషీటర్‌తో అలిస్మా సన్నిహితంగా మెలుగుతూ ఆస్తి మొత్తం తమ పేరుపై మార్చాలంటూ మామ గులాబ్‌జాన్‌తో పాటు దివ్యాంగుడైన భర్తపై ప్రియుడు సమీర్‌తో కలసి దాడి చేస్తోంది.
ఈ విషయంపై బాధితులు కేజీ హళ్లి పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదు. దిక్కుతోచని గులాబ్‌జాన్ సీసీ కెమెరాల ఫుటేజ్‌లతో మీడియాను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.ఇంత జరిగినా పోలీసులు అలిస్మా,రౌడీషీటర్ సమీర్‌పై కేసు నమోదు చేసుకోకపోవడం విమర్శలు,పలు అనుమానాలకు తావిస్తోంది.