వృద్ధురాలిపై కోడలి అఘాయిత్యం

Daughter In Law Attack On Elderly Woman Guntur - Sakshi

గుంటూరు, తెనాలి: ఆస్తి కోసం బంధువుల అఘాయిత్యాలు రోజురోజుకి పెరుగుతున్నాయ్‌. వృద్ధుల సంరక్షణ చట్టం అమల్లోకి వచ్చినా ఈ తరహా నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా రూరల్‌ మండలం సంగంజాగర్లమూడికి చెందిన వృద్ధురాలు నాగుమోతు ధనలక్ష్మి (75) అయినవాళ్ల చేతుల్లోనే దాడికి గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. జూలై 30న స్వయాన కోడలు, మనుమడు భౌతికహింసకు పాల్పడటంతో గాయపడిన ఆమెను కుమారుడు తెనాలి జిల్లా వైద్యశాలలో చేర్పించారు.

డబ్బులు కోసం, ఆస్తి రాసివ్వమంటూ తరచూ వేధిస్తున్నారనీ, చివరకు భౌతికదాడులకు కూడా వెనుదీయటం లేదని బాధితురాలు వాపోయారు. ఇప్పటికి అయిదుసార్లు తనను కొట్టారనీ, ఇప్పుడు మరోసారి దాడిచేసి గాయపరచారని కన్నీటి పర్యంతరమైంది.భుజం, కాళ్లపై గాయాలను చూపుతూ విలపించిందామె. తన కోడలు, మనుమడిని ఇంటి నుంచి బయటకు పంపించి, తనకు రక్షణ కల్పించాలని లేకుంటే తన ఇంటిలో నివసించలేని పరిస్థితులు నెలకొన్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం తెనాలి ఆర్డీవో ఎం.శ్రీనివాసరావుకు విజ్ఞాపన పత్రం పంపినట్టు సమాచారం. తెనాలి డీఎస్పీ ఎం.స్నేహితకు ధనలక్షికి జరిగిన అన్యాయంపై సమాచారం అందినట్టు తెలిసింది.

తెనాలి వైద్యశాలలో నాగమోతు ధనలక్ష్మి
ఉదయమంతా తరగతి గదుల్లో, పుస్తకాల కుస్తీలో అలసిన చిన్నారులను తన ఒడిలోకి తీసుకుని లాలించే అమ్మ దగ్గర లేదు. తలపై చెయ్యి పెట్టి ఆప్యాయంగా పలకరించే నాన్న పక్కన లేడు. కానీ చదువుల తల్లే అమ్మనుకున్నారు. సంక్షేమ హాస్టలే ఇల్లని సంబరపడ్డారు. అధికారులే పెద్ద దిక్కని భావించారు. హాస్టల్‌ అధికారులకు మాత్రం పెద్ద మనసు లేదు. అందుకే తిండి సరిగా లేదు. ఫ్యాన్‌ ఉన్నా తిరగడం లేదు. మరుగుదొడ్లు ఉన్నా నీటి జాడ లేదు. హాస్టల్‌కు ప్రహరీ లేదు.. వాచ్‌మన్‌ దిక్కే లేదు. విజిలెన్స్‌ తనిఖీల్లో జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో ఎక్కడా మానవత్వం జాడ మచ్చుకైనా కనిపించ లేదు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top