8 మంది దొంగలు.. 8 బృందాలు

CP Anjan Kumar Said Hyderabad Tirumalagiri Theft Case Solve By North Zone Police Officer - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగు రోజుల క్రితం నగరంలోని తిరుమలగిరిలో జరిగిన దోపిడి కేసును ఛేదించినట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. దోపిడికి పాల్పడిన 8 మంది దొంగల ముఠాను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ అంజన్‌ కుమార్‌ మాట్లడుతూ ‘ఈ నెల 1న తిరుమలగిరిలో దోపిడి జరిగింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు ఇంటి యజమాని పేరు అడుగుతూ వచ్చి దోపిడికి పాల్పడ్డారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పోలీసులు మొత్తం 8 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. చివరకూ నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసు అధికారులు వీరిని అరెస్ట్‌ చేశార’ని తెలిపారు.

ఆయన మాట్లాడుతూ ‘ఈ గ్యాంగ్‌లో మొత్తం ఎనిమంది ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు చితికి పోవడంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేయడం కోసం ఓ కారును కూడా వాడనట్లు తెలిసింది. వీరంతా దోపిడి సమయంలో మాస్క్‌లు ధరించి ఉన్నారు. ఈ గ్యాంగ్‌కి సయ్యద్‌ మూజుద్‌ లీడర్‌గా వ్యవహరించాడు. ఈ దోపిడి కేసులో సయ్యద్‌ జమీల్‌ ఏ1గా, సయ్యద్‌ ముజీద్‌ను ఏ2గా ఉన్నారు.  ఏ1, ఏ2లపై గతంలో కేసుల కూడా ఉన్నాయి. ఈ కేసులో ఏ1 అయిన సయ్యద్‌ జమీల్‌ గతంలో సనత్‌ నగర్‌లో జరిగిన హత్య కేసులో నిందుతుడిగా ఉన్నాడ’ని తెలిపారు.

ఈ గ్యాంగ్‌ నుంచి 30 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి, 11 మొబైల్‌ ఫోన్స్‌తో పాటు మహీంద్ర కారును కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top