విజిలెన్స్‌ అధికారులమంటూ కాంగ్రెస్‌ నాయకుల హల్‌చల్‌ | Congress Leaders Money Collecting With Vigilance Named In YSR kadapa | Sakshi
Sakshi News home page

సార్‌ వచ్చారు.. పైసలు ఇవ్వండి

Jul 17 2018 12:26 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Leaders Money Collecting With Vigilance Named In YSR kadapa - Sakshi

కారులో ఉండి విజిలెన్స్‌ అధికారిగా చెప్పుకొంటున్న కాంగ్రెస్‌ నాయకుడు చార్లెస్‌

పులివెందుల : పులివెందులలో జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు చార్లెస్‌తోపాటు పులివెందులకు చెందిన ఆ పార్టీ నాయకులు విజిలెన్స్‌ అధికారులమంటూ పైసా వసూళ్లకు పాల్పడుతున్నారు. సోమవారం పట్టణంలోని వినాయకుడి విగ్రహం వద్ద హోటల్‌లో విజిలెన్స్‌ అధికారులమంటూ కాంగ్రెస్‌ నాయకులు వసూళ్లకు పాల్పడుతుండటంతో.. హోటల్‌ యజమాని వారితో వాగ్వాదానికి దిగారు.

ఇలా రెండు నెలలుగా వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పట్టణంలోని హోటళ్ల యజమానులు, వ్యాపారస్తులతో కలసి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చార్లెస్‌తోపాటు మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement