వివాహేతర సంబంధంపై అనుమానంతో నడిరోడ్డుపై దారుణం

In chodavaram Murder Of A Person With Fornication  - Sakshi

నడిరోడ్డుపై యువకుడి హత్య

చోడవరం పట్టణంలో దారుణం 

కత్తితో తల నరికిన నిందితుడు 

వివాహేతర సంబంధంపై అనుమానమే కారణం!

భార్యతోపాటు మరో వ్యక్తిని కూడా నరికి చంపేందుకు యత్నం

కొద్ది గంటల్లోనే నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

సాక్షి, చోడవరం: చోడవరంలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కత్తితో మెడపై నరికి ఓ వ్యక్తి హత్య చేశాడు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో  నిందుతుడ్ని పోలీసు చాకచక్యంగా సంఘటన జరిగిన  కొద్ది గంటల్లోనే అరెస్టు చేశారు. చోడవరం పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో మెయిన్‌రోడ్డుపై ఐలాండ్‌ బ్రాందీ షాపు ఎదురుగా బైక్‌పై ఆగి ఉన్న చోడవరం పిల్లావారితోట వీధికి చెందిన కోన లోవమహేష్‌(23) అలియాస్‌ బొర్రయ్య అనే  యువకుడ్ని అత్యంత కిరాతకంగా ఓ వ్యక్తి హత్యచేశాడు.  ఈ సంఘటనతో ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మహేష్‌పై కక్ష పెంచుకున్న బెన్నవోలుకు చెందిన కొండూరు సత్తిబాబు  అలియాస్‌ ప్రభాస్‌  కత్తితో మాటువేశాడు. ప్లబింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న బొరయ్య ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన స్నేహితులతో కలిసి పట్టణశివార్లలో క్రికెట్‌ ఆడి మధ్యాహ్నం 2.30గంటల సమయంలో తన ఇద్దరు స్నేహితులతో కలిసి భోజనం  తెచ్చుకోవడానికి మెయిన్‌రోడ్డుపై ఉన్న హోటల్‌కు మోటారు సైకిల్‌పై వచ్చాడు.

మద్యం అలవాటు ఉండడంతో మద్యం కోసం ఒకరిని ముందుగా మెయిన్‌రోడ్డుపై ఉన్న ఐ ల్యాండ్‌ బ్రాందీ షాపు దగ్గర దించిన బొర్రయ్య మరో స్నేహితుడితో కలిసి హోటల్‌కి వెళ్లి పలావు కట్టించుకొని బ్రాందీ  షాపు దగ్గర ఉన్న తన స్నేహితుడిని తీసువెళ్లేందుకు వచ్చాడు. పల్సర్‌ బైక్‌పై ఉండి తన స్నేహితుడికి కోసం బండి హారన్‌ కొడుతున్న సమయంలో అప్పటికే వీరి కదలికలను గమనిస్తూ వీరి వెంట వస్తున్న నిందుతుడు ప్రభాస్‌ మోటారు సైకిల్‌పై తలకు హెల్మెంట్‌ ధరించుకొని వెనుక నుంచి వచ్చి  బైక్‌పై వెనుక ఉన్న వ్యక్తి బొర్రయ్య అనుకొని   కత్తితో దాడిచేశాడు.  ఆ సమయంలో కత్తి వెనుకభాగం తగలడంతో  బండిపై ముందు ఉన్న బొర్రయ్యతో పాటు గాయపడిన అతని స్నేహితుడు ఇద్దరు వెనక్కి తిరిగి, ఎదురుతిరిగే లోగానే బొర్రయ్య మెడను  కత్తితో ప్రభాస్‌ నరికి  హత్యచేశాడు. ఆసమయంలో అడ్డుకోబోయిన అతని స్నేహితుడ్ని కూడా నరుకుతానని బెదిరించడంతో ఆ యువకుడు అక్కడ నుంచి భయంతో పక్కకు వెళ్లిపోయాడు. కత్తితో నరుకుతున్న సమయంలో బొర్రయ్య తన చేతులు అడ్డుపెట్టుకోగా ఆ చేతులను కూడా నరికేశాడు. దీంతో మొండెం నుంచి తల వేరై కుప్పకూలిన బొర్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.

అప్పటికీ శాంతించని ప్రభాస్‌ నేలపై పడి ఉన్న బొర్రయ్య మృతదేహాన్ని మరోసారి పరిశీలించి, మళ్లీ మృతదేహంపై కత్తితో నరికి ఉన్మాదిగా వ్యవహించడం అందర్నీ భయబ్రాంతులకు గురిచేసింది. ఈ హత్య సంఘటన అక్కడ ఉన్నవారు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించిన దృశ్యం వాట్సాప్‌లో హల్‌చల్‌చేసింది.  హత్యకు గురైన బొర్రయ్య ఐటీఐ వరకు చదువుకున్నాడు. తల్లి,తండ్రి, చెల్లి, తాతయ్య ఉన్నారు. చోడవరంలో ప్రభాస్‌కు చెందిన వస్త్రదుణంలో  కొత్తకాలం బొర్రయ్య  పనిచేశాడు. ఆ సమయంలోనే ప్రభాస్‌ భార్యతో బొర్రయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించి ఎప్పటికైనా హతమార్చాలనే ఉద్దేశ్యంతోనే చివరికి ఈ హత్య చేశాడని  పోలీసులు భావిస్తున్నారు.  తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసును దర్యాప్తుచేసేందుకు పోలీసు బృందాలు   రంగంలోకి దిగా యి. నర్సీపట్నం ఏఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ , విశాఖ క్రైమ్‌ డీఎస్పీ వివేకనందం నేతృత్వంలో ఇన్‌చార్జి సీఐ సీవీ నర్సింహమూర్తి,చోడవరం, మాడుగుల ఎస్‌ఐలు లక్ష్మణమూర్తి తారకేశ్వరరావులతో  కూడి న పోలీసు బృందాలు నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి పట్టుకున్నాయి.

భార్యను  హత్య చేయడానికి వెళ్తుండగా ..   
వివాహేతర సంబంధం అనుమానంతో బొర్రయ్య ను కత్తితో నరికి హత్యచేసిన ప్రభాస్‌ తన భార్యను, తన సోదరుడిని కూడా హత్యచేసేందుకు వెళ్తుండగా బెన్నవోలు గ్రామ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మరో ఇద్దర్ని హత్యచేయాలని యత్నిస్తుండగా అరెస్టు చేయడం వల్ల ఆ రెండు హత్యలను నివారించగలిగామని ఏఎస్పీ కె. ఆరిఫ్‌ హఫీజ్‌ తెలిపారు. హత్యజరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడ్ని అరెస్టు చేయడం ఇదే మొదటి సారి. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యహరించి జిల్లా ఎస్పీ బాపూజీ ఆదేశాల మేరకు జిల్లా అంతటగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

చోడవరం  మెయిన్‌రోడ్డుపై పోలీసులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతోపాటు హత్య జరిగిన సమయంలో స్థానికులు తీసి వాట్స్‌అప్‌లలో  చక్కర్లు కొట్టిన వీడియోను కూడా పోలీసు  అధికారులు పరిశీలించారు. హత్యకు గురైన బొర్రయ్య కుటుంబసభ్యులతోను, అతని స్నేహితులతోను మాట్లాడి పోలీసు అధికారులు ఈ హత్యచేసింది ప్రభాస్‌గా నిర్ధారించుకున్నారు. గంటలోనే నిందితుడ్ని గుర్తించిన పోలీసులు అతనిని పట్టుకునేందుకు పన్నిన వ్యూహం ఫలిచింది. కొద్ది గంటల్లోనే పోలీసులకు చిక్కడంతో రాత్రి 8గంటలకు అరెస్టు చేసినట్టు ఏఎస్పీ హఫీజ్‌  విలేకరులకు తెలిపారు. ఈ హత్యకు వాడిని కత్తిని ,మోటారు సైకిల్‌ను కూడా స్వాధీనపర్చుకున్నామని తెలిపారు. అయితే ఇంకా ఈ  కేసులో ఎవరున్నదనే దానిపై మరింత విచారణ చేస్తున్నామని నిందితుడ్ని కోర్టులో హాజరుపరుస్తామని ఆయన చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top