నవ వధువు బలవన్మరణం | Bride Anusha Commits Suicide In Prakasam | Sakshi
Sakshi News home page

నవ వధువు బలవన్మరణం

Jul 7 2018 8:32 AM | Updated on Jul 7 2018 8:32 AM

Bride Anusha Commits Suicide In Prakasam - Sakshi

అనూష మృతదేహం

పొదిలి: ఇంట్లో ఎవరూ లేని సమయంలో నూతన వధువు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానిక టైలర్స్‌ కాలనీలో శుక్రవారం జరిగింది. బంధువుల కథనం మేరకు తాళ్లూరు మండలం లక్కవరం గ్రామానికి చెందిన అనూష (19)కు పట్టణంలోని టైలర్స్‌ కాలనీకి చెందిన వేముల మంగమ్మ, నరసింహులు కుమారుడు వేముల సాయిబాబుతో ఎనిమిది నెలల క్రితం వివాహం జరిగింది. టైలర్స్‌ కాలనీలో సొంత గృహంలో కొత్త దంపతులు నివాసం ఉంటున్నారు. పక్కనే ఉన్న మరో సొంత భవనంలో అత్త, మామలు ఉంటున్నారు.

మృతురాలి భర్త దివ్యాంగుడైన సాయిబాబు పట్టణంలో నెట్‌ వర్కు సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో సెంటర్‌కు వెళ్లే సమయంలో భార్య తనకు నీరసంగా ఉందని కొబ్బరి నీళ్లు తెచ్చివ్వాలని అడిగింది. తీసుకుని వచ్చిన అనంతరం సాయిబాబు నెట్‌ వర్కు సెంటర్‌కు వెళ్లాడు. ఆ తర్వాత అనూష ఉరి వేసుకుని మృతి చెందింది. అత్త మంగమ్మ ఇంట్లోకి వెళ్లి చూడగా వేల్లాడుతూ మృత దేహం కనిపించింది. వెంటనే కుమారుడు సాయిబాబుకు, పోలీసులకు సమాచారం అందించారు. తహసీల్దార్‌ విద్యాసాగరుడు ఆధ్వర్యంలో శవపంచనామా నిర్వహించారు. ఆర్‌ఐ సుబ్బరాయుడు, వీఆర్‌ఓ మురళి, సుబ్బారావు వివరాలు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement