ఆదాయానికి మించి ఆస్తులు

Assets beyond revenue - Sakshi

ఆర్‌అండ్‌బీ ఎస్‌డీఓ అరెస్టు

కోర్టులో హాజరు

జయపురం: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రుజువు కావడంతో అండ్‌బీ విభాగ ఎస్‌డీఓను జయపురం విజిలెన్స్‌ విభాగ అధికారులు శుక్రవారంఅరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వివిధ ప్రాంతాలలో గల ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేసి లక్షలాది రూపాయల ఆస్తులను కనుగొన్నారు. జయపురం విజిలెన్స్‌ విభాగ అధికా రులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి.

నవరంగ్‌పూర్‌ జిల్లా ఉమ్మర్‌కోట్‌ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో ఎస్‌డీఓగా పనిచేస్తున్న హిమాంశు శేఖర మండల్‌  ఉమ్మరకోట్‌ నుంచి ఓఆర్‌టీసీ  బస్సులో ఆయన స్వగ్రామం బరంపురం వెళ్తుండగా జయపురం విజిలెన్స్‌ అధికార బృందం జయపురంలో మాటు వేసి ఆయనను  బస్సులోనుంచి దింపి జయపురంలో గల విజిలెన్స్‌ ఎస్‌పీ కార్యాలయానికి తీసుకుపోయారు.

కార్యాలయంలో ఆయనను తనిఖీ చేసి రూ.లక్షా 28 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను విచారణ చేసి   రాష్ట్రంలోని వివిధ ప్రాంతా లలో ఆయనకు గల ఆస్తులపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆ దాడులలో ఉమ్మరకోట్‌లో గల ఆయన నివాస గృహంలో రూ.30,800,  ఎస్‌బీఐ పాస్‌ బుక్‌ లభించగా..భువనేశ్వర్‌లోని సుందరపదలో  ఒక ఇల్లు, బరంపురంలోని కొడాసింగ్‌ ప్రాంతంలో నిర్మాణంలో గల  ఒక భవనం ఉన్నట్లు గుర్తించారు.

అంతేకాకుండా  వాటితో పాటు విలువైన అనేక వస్తువులు కనుగొన్నట్లు విజిలెన్స్‌ ఎస్‌పీ హరేకృష్ణ బెహరా వెల్లడించారు. అనంతరం ఆయనపై కేసు నమోదు చేసి  కోరు ్టకు తరలించినట్లు వెల్లడించా రు. ఈ దాడిలో విజిలెన్స్‌ జయపురం డీఎస్‌పీ హేనరీ కులు, ఇన్‌స్పెక్టర్‌లు శరత్‌ చంద్ర సాహు, బి.రుద్రయ్య, ఏఎస్‌ విశ్వరంజన్‌ బెహరా, సీతాంశు పట్నాయక్‌  నవరంగ్‌పూర్‌ విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ దీనబంధు బెహరా పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top