ఏఎస్‌ఐ వీరంగం

ASI Overaction In Civil Case In Nizamabad - Sakshi

భూ వివాదంలో జోక్యం  

ఒకరిపై విచక్షణారహితంగా దాడి  

ఏసీపీకి బాధితుడి ఫిర్యాదు

నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లా నవీపేట పోలీసుస్టేషన్‌ ఏఎస్‌ఐ జాన్‌సన్‌ మంగళవారం వీరంగం సృష్టించాడు. ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టాడు. వివరాలు.. నిజామాబాద్‌ రూరల్‌ మండలం పాల్దా గ్రామానికి చెందిన కిరణ్‌రావు ఆయన బంధువు మధుసూదన్‌రావు మధ్య పంట పొలానికి సంబంధించి కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పంట పొలాల సరిహద్దులో కిరణ్‌రావు బోరు వేశారని మధుసూదన్‌ నవీపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మంగళవారం కిరణ్‌రావును పోలీసుస్టేషన్‌కు పిలిపించాడు.

ఏఎస్‌ఐ జాన్‌సన్‌ స్టేషన్‌లో విచక్షణారహితంగా బెల్ట్‌తో చితకబాదాడని, కాలుతో తన్నాడని బాధితుడు ఆరోపించారు. అకారణంగా దుర్భాషలాడారని వాపోయాడు. ఫిర్యాదు చేసిన వారి ఎదురుగానే తనను లాకప్‌లో వేసి చితకబాదాడని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఏసీపీ శ్రీనివాస్‌రావును కలసి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఏఎస్‌ఐ జాన్‌సన్‌ను వివరణ కోరగా.. తాను కొట్టలేదని, కిరణ్‌రావు చెప్పిన మాటలు అవాస్తవమని పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top