దారుణం: వేశ్యలపై 9 మంది సామూహిక అత్యాచారం

9 Men Rape Three Delhi Prostitutes at Noida Farmhouse - Sakshi

నొయిడా : దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం పడుపు వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న ముగ్గురు వేశ్యలపై 9 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన బుధవారం నోయిడాలో చోటుచేసుకుంది. బాధితురాల్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ కాగా.. ఒకరు క్యాబ్‌ డ్రైవర్‌ ఉన్నాడని తెలిపారు.

‘మంగళవారం రాత్రి లజ్‌పత్‌ నగర్‌ మెట్రోరైల్వేస్టేషన్‌ సమీపంలో క్లైంట్స్‌ కోసం వేచి ఉన్న మా వద్దకు స్విప్ట్‌ డిజైర్‌ కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నాం. రూ.3600 అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. అనంతరం నొయిడా సెక్టార్‌ 135లోని ఓ ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. అక్కడికి మరో ఏడుగురు వ్యక్తులు వచ్చారు. వారిని చూసిన వెంటనే మేం వెళ్లిపోతామని చెప్పాం. కానీ వారు దానికి ఒప్పుకోకుండా బలవంతంగా అత్యాచారం చేశారు. భౌతికంగా దాడి చేశారు. అనంతరం అందులోని ఒక వ్యక్తిని బతిమాలితే.. బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మెయిన్‌ రోడ్డుపై వదిలిపెట్టాడు. వెంటనే 100కు డయల్‌ చేసి జరిగిందంతా చెప్పాం. వారు మాకిచ్చిన అడ్వాన్స్‌ కూడా బలవంతంగా లాక్కున్నారు.’ అని బాధితురాల్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top