అమ్మో! జీలకర్ర

30,000 kg fake cumin made from broom bits seized in UP  - Sakshi

రాయబరేలి : జీలకర్ర దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో ఉపయోగించే సాధారణ మసాలా (ఔషధ) దినుసు. కాదేదీ కల్తీకి అనర్హం అని రెచ్చిపోతున్న అక్రమార్కులు పెద్దమొత్తంలో నకిలీ జీలకర్రను సరఫరా తయారు చేస్తూ పోలీసులకు దొరికారు. ఉత్తర ప్రదేశ్, రాయ్ బరేలిలో ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. చిపురు పుల్ల ముక్కలు, ఎండుగడ్డి, మొలాసిస్ ఉపయోగించి తయారు చేసిన 30వేల కిలోల నకిలీ జీలకర్ర (జీరా)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని  రూ. 60 లక్షలు వుంటుందని అధికారులు తెలిపారు. 
 
మహారాజ్‌గంజ్ డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ వినీత్ సింగ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. చీపురు ముక్కలతోపాటు ఎండు గడ్డిని చీపుర్లలా తయారు చేస్తారు. అనంతరం వీటిని వేడి వేడి మొలాసిస్‌లో ముంచి ఎండ బెడతారు. ఎండిన తర్వాత, నిజమైన జీలకర్రలా కనిపించేలా ముక్కలుగా చేసి కల్తీ చేసి వివిధ నగరాలకు రవాణా చేస్తున్నారని తెలిపారు. 80, 20 నిష్పత్తిలో కల్తి చేశారన్నారు. తద్వారా ముఠా సభ్యులు 50 నుంచి 60 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించుకుంటారనితెలిపారు. గత ఏడాది కాలంతా ఈ  ముఠా ఈ దందాను కొనసాగిస్తోందన్నారు.

ఈ కేసులో ప్రశాంత్ సాడు, కమలేష్ మౌర్య, పంకజ్ వర్మ, ఇంద్రజీత్, పవన్ గుప్తా, రాజేంద్ర ప్రసాద్, చోతేలాల్‌పై కేసు నమోదు చేశారు. పరారీలోఉన్న వీరిని అరెస్టు చేయడానికి రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారి తెలిపారు. గత నెలలో ఢిల్లీ పోలీసులు దాదాపు ఇలాంటి భారీ రాకెట్టును ఛేదించిన సంగతి తెలిసిందే.  సో.. నకిలీ ఏదో.. అసలు ఏదో నిర్ధారించుకోవాల్సిన పదార్థాల జాబితాలో జీలకర్ర కూడా చేరిందన్నమాట.


ఇటీవల ఢిల్లీలో స్వాధీనం చేసుకున్న నకిలీ జీలకర్ర తయారీ దృశ్యాలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top