హెచ్‌సీఏపై నిప్పులు చెరిగిన అజారుద్దీన్‌

Azharuddin slams on Hyderabad Cricket Association - Sakshi

హెచ్‌సీఏ అవినీతిపై విచారణ జరపాలి

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)పై టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద‍్దీన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోథా సిఫార్సులను హెచ్‌సీఏ అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్‌ విమర్శించారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంతో మాట్లాడుతూ...‘  నేను రాజకీయంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి పోటీ చేశానని క్రికెటర్‌గా యూపీ నుంచి రిజిస్ట్రర్‌ ఎలా చేసుకుంటాను.

హెచ్‌సీఏ అందరిని పక్కదారి పట్టిస్తోంది. గ్రామీణ క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు. జిల్లా, రూరల్‌ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. హెచ్‌సీఏ నిర్వహించే టీ20 లీగ్‌ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ లీగ్‌కు వివేక్‌ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదు. హెచ్‌సీఏ లోగోతో వివేక్‌ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్‌ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే. ఇక బీసీసీఐ నుంచి నాకు క్లియరెన్స్‌ రాలేదని ఆరోపించారు. కానీ నాకు హైకోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దీనిపై నేను బీసీపీఐకి నివేదిక పంపాను. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌ తప్పు చేశారు. చదువుకున్న వ‍్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం. దీనిపై నేను చట్టపరంగా ముందుకు వెళతా. నాకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌తో ఎలాంటి సంబంధం లేదు. అయితే నన్ను ఓ సెలబ్రెటీగా అందరూ ఆహ్వానిస్తారు’  అని తెలిపారు.

Read latest Cricket News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top