213 పట్టణాలకు విస్తరించిన జొమాటో 

Zomato enters 213 new cities - Sakshi

ఏపీలో ఆరు పట్టణాల్లో తాజా ప్రవేశం 

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ రెస్టారెంట్స్, ఫుడ్‌ డెలివరీ సేవల సంస్థ జొమాటో...  తన ఆన్‌లైన్‌ ఆర్డర్‌ సేవలు, ఫుడ్‌ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా 200కు పైగా పట్టణాలకు విస్తరించినట్టు సోమవారం ప్రకటించింది. నూతనంగా 17 పట్టణాల్లో సేవలు ప్రారంభించగా ఇందులో ఆరు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండడం గమనార్హం. దీంతో తమ సేవలు అందుబాటులో ఉన్న పట్టణాల సంఖ్య 213కు చేరినట్టు వెల్లడించింది. దీంతో దేశ నలుమూలలా ఎర్ర చొక్కాతో కూడిన తమ డెలివరీ ఏజెంట్లను చూడొచ్చని పేర్కొంది.

కొత్తగా, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, ఒంగోలు, నంద్యాల, భీమవరం, మచిలీపట్నం, శ్రీకాకుళం, కేరళలోని కొట్టాయం, కొల్లామ్, పంజాబ్లోని ఖన్నా, గురుదాస్‌పూర్, తమిళనాడులోని అంబుర్, జార్ఖండ్‌లో దియోగఢ్, యూపీలో బులంద్‌షహర్, షాజహాన్‌పూర్‌ పట్టణాలు, హిమాచల్‌ ప్రదేశ్‌లో సోలన్, హర్యానాలో పల్వాల్‌లో తమ సేవలను ప్రారంభించినట్టు తెలియజేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 20 కోట్ల మంది ప్రజలకు సేవలు అందించగమలని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 500 పట్టణాలకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని ప్రకటించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top