
న్యూఢిల్లీ: మ్యూజిక్ సేవలను అందించే యూట్యూబ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌ను యూట్యూబ్ బుధవారం భారత్‌లో ఆవిష్కరించింది. వేలాది పాటలు, రీమిక్స్‌లు, లైవ్ ప్రదర్శనలు, కవర్, మ్యూజిక్ వీడియోలు ఇందులో లభించనున్నాయి. అన్ని రకాల మ్యూజిక్‌లను మొదటి సారిగా ఒకే వేదికగా అందిస్తున్నట్టు యూట్యూబ్ తెలిపింది.
ప్రకటనలతో కూడిన మ్యూజిక్ సేవలు ఉచితంగా పొందొచ్చు. అదే సమయంలో యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం వెర్షన్‌ను కూడా యూట్యూబ్ తీసుకొచ్చింది. సభ్యత్వ రుసుం చెల్లించడం ద్వారా పూర్తి స్థాయి మ్యూజిక్ సేవలను ఇందులో పొందొచ్చు. ప్రతీ నెలా రూ.99 నుంచి సబ్‌స్క్రిప్షన్ మొదలవుతుంది. ఇందులో ప్రకటనలు ఉండవు.