ఏ సర్టిఫికేట్స్ లేకుండానే పీఎఫ్ విత్ డ్రా | You can withdraw EPF for treatment without doctor certificate | Sakshi
Sakshi News home page

ఏ సర్టిఫికేట్స్ లేకుండానే పీఎఫ్ విత్ డ్రా

Apr 27 2017 6:22 PM | Updated on Sep 5 2017 9:50 AM

ఏ సర్టిఫికేట్స్ లేకుండానే పీఎఫ్ విత్ డ్రా

ఏ సర్టిఫికేట్స్ లేకుండానే పీఎఫ్ విత్ డ్రా

నాలుగు కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

న్యూఢిల్లీ : నాలుగు కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యులకు రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అనారోగ్యం పాలైనప్పుడు చికిత్సకు అవసరమయ్యే నగదు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఫండ్స్ విత్ డ్రా చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది. దివ్యాంగులు కూడా పరికరాలు కొనుక్కోవడానికి ఎలాంటి మెడికిల్ సర్టిఫికేట్ ఇవ్వాల్సినవసరం లేదని, నగదు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952ను సవరించినట్టు ప్రకటించింది. ఇన్నిరోజులు అనారోగ్యం పాలైనప్పుడు చికిత్స కోసం, అంగవైకల్యం వారు పరికరాలు కొనుకునేందుకు ఈపీఎఫ్ ఫండ్ విత్ డ్రాకు పలు సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉండేది.
 
ప్రస్తుతం కాంపొజిట్ ఫామ్ తో సెల్ఫీ డిక్లరేషన్ ఇచ్చి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ 1952లోని క్లాస్ 68-జే, 68-ఎన్ లకు కార్మిక మంత్రిత్వ శాఖ సవరణ చేసిందని, నాన్-రిఫండబుల్ అడ్వాన్సులను వైద్య చికిత్స కోసం తీసుకునేలా అవకాశం కల్పిస్తున్నట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. ప్రస్తుతం పేరా 68-జే కింద వైద్య చికిత్స కోసం ఈపీఎఫ్ సభ్యులు అడ్వాన్స్ ను కోరవచ్చు. అదేవిధంగా పేరా 68-ఎన్ కింద అంగవైకల్యం కలవారు పరికరాలు కొనుక్కునేందుకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. 2017 ఏప్రిల్ 25న చేపట్టిన సవరణతో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ జారీచేసిందని అధికారి పేర్కొన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement